![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -370 లో..... సీతాకాంత్ రమ్యతో పెళ్లి కి ఒప్పుకోవడం లేదని శ్రీలత సీతకాంత్ ని తీసుకొని ఫణీంద్ర ఇంటికి వెళ్తుంది. నీ మనవరాలి వళ్ల నా కొడుకు ప్రశాంతంగా లేడు.. ఇప్పుడే ఆ అమ్మాయి రామలక్ష్మి నా మైథిలీనో తేలాలని శ్రీలత అంటుంది. నీ కొడుకే నా మనవరాలి వెంట రామలక్ష్మి రామలక్ష్మి అంటూ తిరుగుతున్నాడని శ్రీలతపై కోప్పడతాడు ఫణీంద్ర.
మీకు ఎన్నిసార్లు చెప్పాలండి.. నేను మైథిలి అని.. అందుకు సాక్ష్యం పాస్ పోర్ట్ చూపించాను కదా మళ్ళీ ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారని సీతాకాంత్ పై రామలక్ష్మి కోప్పడుతుంది. ఇలా మా మనవరాలి వెంట పడి వేదిస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఫణీంద్ర అనగానే శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. మర్యాద గా ఇక్కడి నుండి వెళ్ళండి అని ఫణీంద్ర వార్నింగ్ ఇస్తాడు. శ్రీలత, రామలక్ష్మి, శ్రీవల్లి బయటకు వస్తారు. అమ్మ చేసిన పనికి వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. వాళ్ళని కూల్ చెయ్యాలని సీతాకాంత్ మళ్ళీ వస్తానంటు లోపలికి వెళ్తాడు. బావగారు మళ్ళీ లోపలికి వెళ్తున్నారని శ్రీవల్లి అనగానే ఇంత జరిగింది మళ్ళీ వాడిని క్షమిస్తారని ఎలా అనుకుంటావని శ్రీలత అంటుంది. సీతాకాంత్ లోపలికి వెళ్లి వాళ్లకు సారీ చెప్తాడు. ఆ తర్వాత శ్రీలత, శ్రీవల్లి పంతులిచే సీతాకాంత్ ని పెళ్లి చేసుకొమ్మని చెప్పిస్తారు కదా.. ఆ పంతులికి శ్రీలత డబ్బులు ఇస్తుంది.. అలా డబ్బు ఇచ్చేది రమ్య విషయంలో ఎంక్వయిరీ చేస్తున్న అతను వీడియో తీసి మైథిలీకి పంపిస్తాడు.
ఆ వీడియో మైథిలీ చూసి ఎంత పని చేస్తున్నారు అత్తయ్య అని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ వీడియోని రామలక్ష్మి వేరే నెంబర్ నుండి శ్రీలతకి పంపిస్తుంది. శ్రీలత ఆ వీడియో చూసి టెన్షన్ పడుతూ శ్రీవల్లిని పిలుస్తుంది. మన చుట్టూ ఏదో జరుగుతుంది అత్తయ్య అని భయపడుతుంది. మీరు చేస్తున్నా ప్రయత్నం ఆపకపోతే ఈ వీడియో చేరాల్సిన వాళ్ళకి చేరుతుందని మెసేజ్ కూడ రావడంతో శ్రీలత ఇంకా టెన్షన్ పడుతుంది. మరొకవైపు రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్, రామ్ వెళ్తారు. సీతాకాంత్ బయట ఫోన్ మాట్లాడుతుంటే.. రామ్ లోపలికి వెళ్లి హాల్లో రామలక్ష్మి ఫోన్ ఉంటే అది తీసుకోబోతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి ఫోన్ తీసుకుంటుంది. సీతాకాంత్ లోపలికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |